ELR: పెదపాడు శాఖా గ్రంథాలయంలో వేసవి శిబిరం నిర్వహించారు. మంగళవారం విద్యార్థులకు క్షేత్రగణితం, త్రిభుజాలు, శంఖువు, గోళం వంటి వివిధ గణిత సూత్రాలను గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు తేలికగా అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులచే ‘దేశ దేశాల కప్పల కథలు’ పుస్తకం నుంచి నీతి కథలను చదివించి, వాటిపై పుస్తక సమీక్ష చేయించారు.