TG: ముదిరాజ్ విద్యావంతుల వేదికలో ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా 7.46 శాతంగా ఉన్నారని తెలిపారు. 35 నియోజకవర్గాల్లో ముదిరాజ్‌లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కానీ రాజకీయంగా ముదిరాజ్‌ను తగిన ప్రాధాన్యత లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరుగుతుందో అంతా ఆలోచించుకోవాలన్నారు