E.G: మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం డీఈఐసీ రాజమండ్రి వైద్య బృందం బాలిక సదనంలో నివసిస్తున్న చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి, అవసరమైన వైద్య సేవలు, చికిత్సలు & సలహాలను అందించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న చిన్నారులను గుర్తించి తదుపరి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు.