NLG: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2026 అవార్డులకు ఆసక్తి కలిగిన బాలలు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. ధైర్యసాహసం, సామజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం తదితర అంశాలపై 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన బాలలు https//awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.