KNR: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం రంగరావుపల్లి గ్రామంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి శంకరయ్య గ్రామస్థులతో మాట్లాడుతూ.. ఆడపిల్లలకు బాల్యం ఎంతో అమూల్య మైందని, వారికి ఉన్నత చదువులు చెప్పించి, జీవితంలో పైకి ఎదిగేలా ప్రోత్సహించాలని చెప్పారు.