TG: చివరి ధాన్యపు గింజ కొనుగోలు చేసే వరకు పోరాడతామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ స్పష్టం చేశారు. గన్నీ బ్యాగులు, లారీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.