మాజీ సైనికులు, అగ్నివీరులకు అండగా నిలిచేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సేవలో రిటైర్డ్ అయిన సైనికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో భారత సైన్యంతో ఒక కొత్త సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, తక్షణమే 5,000 మందికి పైగా మాజీ సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో ‘పాయింట్స్మెన్’గా నియమించుకోనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.