WGL: వచ్చే 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు తెలిపారు.