KKD: తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలిగా కాకినాడ మాజీ మేయర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ను నియమించింది. గతంలో తుని నియోజకవర్గ పరిశీలకురాలిగా సమర్థవంతంగా పనిచేసిన ఆమెకు మరో కీలక బాధ్యత అప్పగించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల సమన్వయం కోసం ఆమె కృషి చేయనున్నారు.