ELR: జంగారెడ్డిగూడెం(m) కేతవరం గ్రామంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఐ ఎం.వి. సుభాష్ ప్రజలకు శాంతిభద్రతలు, వేసవిలో దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. జూదం, నాటుసారా వంటి అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ల ద్వారా నిఘా ఉంచుతామన్నారు. ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.