AP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచిఉన్నారు. నిన్న స్వామి వారిని 89,399 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.