BHPL: కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా ఆదిలాబాద్‌కు చెందిన శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్ వద్ద పుష్కర స్నానం ఆచరించారు. ఘాట్ వద్ద వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, శుభానంద దేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.