మెదక్ జిల్లాలో మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మహిళా సమాఖ్య సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, గోదాములు, రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు వంటి విభిన్న వ్యాపార రంగాల్లో మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.