PDPL: జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనర్హులు, పనిచేయని వారిని తొలగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. నిజమైన జర్నలిస్టులకు అప్లికేషన్లు ఇచ్చి, జర్నలిస్టుల హక్కులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.