ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవికి సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో మౌలిక వసతులు లేక పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి మున్సిపాలిటీలోని అన్ని వార్డులో మౌలిక వసతులు కల్పించాలన్నారు.