TG: బంగారు గొలుసు చోరీకి గురైందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఘటనా స్థలాన్ని చూపించాలని SI ఆమెను అడవిలోకి తీసుకెళ్లి అక్కడే వదిలేసిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో జరిగింది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన గ్రామస్థులు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. చివరికి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.