ఏలూరు నగరంలో 50 డివిజన్లను 62 డివిజన్లుగా మార్చే ప్రక్రియను మున్సిపల్ అధికారులు సక్రమమైన విధానంలో పూర్తి స్థాయిలో చేపట్టాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రజాసంఘాల కార్యాలయంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో డివిజన్ల పునర్వ్యవస్థీకరణ సరిగా చేయకపోవడం వల్లే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు,అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.