జనగామ జిల్లా చిలుపూరు మండలం తీగల తండాలో నిర్మిస్తున్న మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను సోమవారం వెంకటేశ్వర స్వామి దేవాలయ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తీగల సాంబరాజు 200 గజాల స్థలాన్ని భవన నిర్మాణానికి ఉచితంగా అందించగా రూ. 25 లక్షల నిధులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంజూరు చేశారు.