BPT: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన 59 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు.