కృష్ణా: పెనమలూరు(M) పోరంకి టీడీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో MLA బోడే ప్రసాద్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా మహానాడు కార్యక్రమం జరుగుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ప్రజాసేవలో ముందుందని తెలిపారు. వర్చువల్ మహానాడు ప్రజాప్రయోజనాల కోసమేనని, క్లస్టర్ సమావేశాల ద్వారా పార్టీ బలోపేతం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.