ఏలూరు: జిల్లా పరిషత్ ప్రాంగణంలో ప్రపంచ తప్పిపోయిన పిల్లల దినోత్సవం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో పిల్లలపై ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.