NLR: గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి తెలిపారు. బుచ్చి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. పట్టణంలో డ్రైనేజీ ఏర్పాటు, కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రాలు అందజేశారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు.