NLG: నార్కట్‌పల్లిలో దుకాణాల మీదికి దూసుకెళ్లిన లారీ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇరువురికి గాయాలు అయ్యాయి. బండల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పడంతో మాండ్రగామానికి చెందిన మేడి కృష్ణ లారీ కింద పడి మృతి చెందాడు. డ్రైవర్‌ను క్యాబిన్లో ఇరుక్కోగా పోలీసులు బయటికి తీశారు. పండ్ల వ్యాపారి గౌస్‌కు గాయాలయ్యాయి. మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.