అనకాపల్లి పోలీస్ ఆఫీసులో నిర్వహించిన పీజిఆర్ఎస్లో ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజల నుంచి 58 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై 7 రోజుల్లో నిష్పక్షపాత విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులని ఆదేశించారు. నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని అధికారులకు సూచించారు. అలాగే, మహిళా రక్షణకు పెద్దపీట వేస్తామన్నారు.