VSP: హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలోని గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ప్రస్తుత ప్రశాంత పరిస్థితుల్లోనూ భద్రతా బలగాలు అత్యున్నత అప్రమత్తతతో ఉండాలని సూచించారు. గ్రేహౌండ్స్ కమాండోల శిక్షణ, క్రమశిక్షణ, కార్యాచరణ సామర్థ్యాలను ఆమె అభినందించారు. ఇటీవల అభివృద్ధి చేసిన ఆధునిక శిక్షణా మౌలిక సదుపాయాలను పరిశీలించారు.