GDWL: గద్వాల మార్కండేయ కళ్యాణ మండపంలో చేనేత హక్కుల సాధన సభ ఘనంగా జరిగింది. బీసీ రాజాధికారం ఫోరం నేత టి. చిరంజీవులు మాట్లాడుతూ బడ్జెట్లలో చేనేత రంగానికి తగిన నిధులు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ముడిసరుకుల ధరల పెరుగుదల, మార్కెట్ లేమితో కార్మికులు సంక్షోభంలో ఉన్నారన్నారు. వీరికి పెన్షన్, బీమా, నూలు రాయితీలు కల్పించాలని, లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు.