NRPT: బడి మానేసిన ప్రతి చిన్నారి తిరిగి బడిలో చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ బడుల్లోని విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం తదితర వివరాలను ప్రజలకు వివరించాలని ఆమె పేర్కొన్నారు.