కోనసీమ: అమలాపురంలో ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ ప్రసాద్ బాధితుల నుంచి నేరుగా 25 అర్జీలు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాంతి పద్ధతుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.