AP: రేపు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ సినీ నిర్మాతలు భేటీ కానున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలతో పాటు, పర్సంటేజ్ విధానంపై పవన్‌తో నిర్మాతలు చర్చించే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లపై కూడా ఈ భేటీలో చర్చించే ఛాన్సుంది. ఇవే సమస్యలపై ఇవాళ మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు సమావేశమై తమ సమస్యలను తెలియజేశారు.