అన్నమయ్య: మదనపల్లి పట్టణంలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా రూ. 4.10 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా వారి ఇండ్లకు వెళ్లి పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులతో మమేకమైన ఎమ్మెల్యే, ప్రభుత్వ సహాయం అవసరమైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు కృతజ్ఞతలు తెలిపారు.