BHPL: ప్రజావాణిలో అందిన వినతులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో 40 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వినతిని పోర్టల్లో నమోదు చేసి రశీదు అందించాలని సూచించారు. పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.