SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ SFI జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.