ADB: మాజీ కౌన్సిలర్ దారవేణి సత్యనారాయణ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని శాంతినగర్లో నిర్వహించిన సత్యనారాయణ అంత్యక్రియలు మాజీ మంత్రి పాల్గొని పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ బలోపేతానికి క్రియాశీలకంగా పని చేసిన గొప్ప నాయకుడు అని ఆయన్ను కొనియాడారు.