గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 148 వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన, చట్టబద్ధంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడం శాఖ బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.