ASR: డుంబ్రిగూడ మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ నిశాంతి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అవగాహనతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేందుకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌ను పరిశీలించారు. విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలపై అడిగి తెలుసుకున్నారు.