కృష్ణా: జిల్లా కోడూరు మండలం కుమ్మరిపాలెంలోని లంకమ్మ తల్లి ఆలయంలో ఎస్సీ కుటుంబాలకు ప్రవేశం కల్పించాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. దళితులను ఆలయంలోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ తలుపులు తెరిపించి సమాన హక్కులు కల్పించాలని, ఘటనపై విచారణ జరిపి పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.