NZB: జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ మండల కేంద్రంలో తాగునీటి కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఒకటో వార్డులో గత పది రోజుల నుంచి తాగునీటి ఎద్దడితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి బోర్లు మరమ్మత్తులు నాణ్యత లోపించడంతో వారంలో మూడుసార్లు పాడైపోవడంతో ప్రజలకు నీటి సమస్య తపడం లేదు.