GNTR: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రాజధాని ప్రాంత వాసులు తమ అర్జీలను అడిషనల్ కమిషనర్లు ఏ. భార్గవతేజ, కొల్లాబత్తుల కార్తీక్‌లకు అందజేశారు. సమస్యలను పరిశీలించి, పరిష్కరిస్తామని APCRDA అధికారులు హామీ ఇచ్చారు.