TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట విచారణకు MLA దానం నాగేందర్ హాజరుకానున్నారు. BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపిస్తూ దానంపై అనర్హత వేటు వేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో దానం విచారణకు హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ పలువురిని విచారించిన సంగతి తెలిసిందే.