WGL: వరంగల్ నగరంలోని చింతల్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మహిళా వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సత్య శారద ప్రారంభించారు. ఈ శిబిరంలో 66 మంది మహిళలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించి, రక్తం తక్కువగా ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ డా. సాంబశివరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.