AKP: రోలుగుంట డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ రామమూర్తిని సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ విజయ్ కృష్ణన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె. అడ్డసరంలో 2018లో అప్పటి RDO విచారణ చేసి రద్దు చేసిన ఖాతా నంబర్ 559ను డీటీ డిజిటల్ సైన్ పెట్టి ఖాతాను రెన్యువల్ చేసి హక్కులు కల్పించడంపై సాగుదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు.