విజయవాడ PWD గ్రౌండ్స్ ప్రాంగణంలో రూపుదిద్దుకున్న BR అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో అంబేడ్కర్ చిత్రపటానికి సీఎంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు నమస్కరించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి సాధారణ కార్యక్రమం మాదిరిగా కన్వెన్షన్ సెంటర్ను చంద్రబాబు ప్రారంభించారు.