NLR: దుత్తలూరు మండలంలో MSME పార్కుల శంకుస్థాపన కార్యక్రమం సోమవారం MLA కాకర్ల సురేష్ సమక్షంలో జరిగింది. ఈ పార్కుల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు. రవాణా, విద్యుత్, చిన్న వ్యాపార రంగాలూ అభివృద్ధి చెంది, మండలం పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.