ప్రకాశం: మద్దిపాడు (మం) తెల్లబాడు గ్రామ సమీపంలో సోమవారం పేకాట ఆడుతున్న ఐదు మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న ఐదు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరించారు.