ELR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు SI ఎం. సూర్యభగవాన్ తెలిపారు. నిందితులను సోమవారం తాడేపల్లిగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈమేరకు వారికి న్యాయమూర్తి డీ. మంగతాయారు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.