GDWL: విద్యాశాఖ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలను రద్దు చేయాలని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య డిమాండ్ చేశారు. సోమవారం అదనపు కలెక్టర్ మధుమోహన్కు వినతి పత్రం అందజేశారు. మౌలిక వసతులు లేకుండా రేకుల షెడ్లలో పాఠశాలలు నడుస్తున్నాయని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.