ములుగు జిల్లాలో కారుణ్య నియామకాల ద్వారా ఐదుగురికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఉద్యోగంలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులకు పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.