CTR: రాబోయే రెండు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, రాత్రి వేళల్లో వాతావరణం మారి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.