NGKL: అచ్చంపేట ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు భూములకు సంబంధించిన రెండు అర్జీలను సమర్పించారు. ఈ ఫిర్యాదులను ఆర్డీవో యాదగిరి స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయా సమస్యలను తక్షణం పరిశీలించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.