PLD: చిలకలూరిపేటలో చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను టార్గెట్గా చేసుకుని గొలుసులు లాక్కెళ్తున్న ఈ ముఠా నుంచి 3 సవర్ల బంగారు గొలుసు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 కేసులు నమోదయ్యాయని చెప్పుకొచ్చారు. కృపరావుపై 36, కొండారెడ్డిపై 41 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.